సామాజిక సారథి,హాలియా: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన సామాజిక దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు పూలే ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. పూలే 131వ వర్థంతి సందర్భంగా హాలియాలోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఆదివారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా నోముల భగత్ మాట్లాడుతూ సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి, వారి విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త, మానవాతావాది అని కొనియాడారు. కార్యక్రమంలో అనుముల మండల అధ్యక్షుడు కూరాకుల వెంకటేశ్వర్లు, పట్టణ అధ్యక్షుడు చెరుపల్లి ముత్యాలు, వద్దిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, చల్లా మట్టారెడ్డి, సురభి రాంబాబు, మొహమ్మద్ బాబుద్దీన్, కూరాకుల రవి గడ్డం రమణ, బొమ్మిశెట్టి ఆంజనేయులు, ముఖ్య నాయకులు, ప్రతినిధులు, అనుబంధ సంఘం నాయకులు పాల్గొన్నారు.