సామాజిక సారథి, వెల్డండ: బీసీ గణన చేపట్టాలనే డిమాండ్‌తో ఈనెల 8న బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆధ్వర్యంలో చేపట్టే పార్లమెంట్ముట్టడి కార్యక్రమాన్ని బీసీలు విజయవంతం చేయాలని బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నకినమోని పెద్దయ్య యాదవ్ కోరారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పాలకులు అక్రమ సంపాదన ధ్యేయంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ప్రజాసమస్యలను గాలికి వదిలేశారని, సెటిల్ మెంట్ల మీద ఉన్న ప్రేమ ప్రజాసమస్యలపై చూపడం లేదన్నారు. బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకొని గాలికి వదిలేస్తున్నారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలను అణగదొక్కుతున్నారని పేర్కొన్నారు. పార్లమెంట్ముట్టడిని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
- December 2, 2021
- Archive
- Top News
- లోకల్ న్యూస్
- 8న
- BC
- On the 8th
- PARLIAMENT
- Siege
- Welfare
- పార్లమెంట్
- బీసీ
- ముట్టడి
- వెల్ ఫెర్స్
- Comments Off on 8న పార్లమెంట్ ముట్టడి