సారథి, చొప్పదండి: కరోనా వ్యాప్తి పెరుగుతుండడంతో జనం హడలిపోతున్నారు. కరీంనగర్జిల్లా చొప్పదండి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి టెస్టుల కోసం జనం తాకిడి పెరిగింది. తెల్లవారుజాము నుంచి మొదలు కుని మధ్యాహ్నం వరకు ఎండలోనే ఉండి టెస్టులు చేయించుకోని పోతున్నారు. శుక్రవారం ఇలా కొంతమంది తమ చెప్పులు, ఇంకొంతమంది ఆధార్‌కార్డులను క్యూ లైన్ఉంచి మరీ పరీక్షలు చేయించుకుంటున్నారు. చివరికి కిట్లు లేవని వైద్యసిబ్బంది చెప్పడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో కిట్ల సంఖ్య పెంచాలని కోరుతున్నారు.
- April 30, 2021
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- CARONA
- CHOPPADANDI
- KARIMNAGAR
- కరీంనగర్
- కరోనా
- చెప్పులు క్యూ
- చొప్పదండి
- Comments Off on కరోనా టెస్టులకు చెప్పులే క్యూ లైన్