Breaking News

జర్నలిస్ట్ ల సమస్య లు పరిష్కరించాలి

-ఎంపి,ఎమ్మెల్యే లకు వినతిపత్రాలు ఇవ్వాలి
-రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా. బండి విజయ్ కుమార్

సామాజిక సారథి , మహబూబ్ నగర్ : ప్రభుత్వం జర్నలిస్ట్ ల సమస్య లను పరిష్కరించాలని ఎంపీ లకు, జిల్లా ఎమ్మెల్యే లకు వినతి పత్రాలు ఇవ్వాలని టీ డబ్ల్యూ జె ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండి విజయ్ కుమార్ అన్నారు. గురువారం మహబూబ్ నగర్ టి డబ్ల్యూ జె ఎఫ్ జిల్లా కమిటీ సమావేశానికి ముఖ్య అతిథులు హాజరైన ఆయన మాట్లాడుతు అనేక సంవత్సరాలనుండి జర్నలిస్ట్ లు పని చేస్తున్నారని అన్నారు. కానీ వారి సమస్య లు ఇంకా పరిష్కారం కాకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం జర్నలిస్ట్ లను స్కిల్డ్ కార్మికుల గా గుర్తించి నెలకు రూపాయలు 20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం చేసిన వాగ్దానాలు డబుల్ బెడ్ ఇల్లు తక్షణమే ఇచ్చి ఆదుకోవాలని కోరారు. అనేక మంది జర్నలిస్ట్ లు కిరాయి ఇళ్లలో ఉంటున్నారని తెలంగాణ కోసం కొట్లాడిన జర్నలిస్ట్ కు సొంత ఇంటి కల నేటికీ నెరవేరకపోవడం నిరాశ నిస్పృహకు గురించేస్తుందని తెలిపారు.హార్వులైన వారికీ రెండవ విడత లో అక్రిడిటేషన్ కార్డ్స్ ఇవ్వడం లో జాప్యం జరగకుండా ఇవ్వాలని అన్నారు.హెల్త్ కార్డ్స్ లు అన్ని కార్పొరేట్ హాస్పిటల్ లో పని చేసే విదంగా చర్యలు తీసుకోవాలన్నారు. రైల్వే పాస్ లు చెల్లుబాటు అయ్యో విదంగా కేంద్రప్రభుత్వం అమలు చేయాలని కోరారు. రాష్టంలో నిరుద్యోగం పెరిగిందని నేడు మీడియా రంగంలో బాగా విస్తరించడం మూలం గా జర్నలిజం లోకి వస్తున్నారని ఈసందర్బంగా అన్నారు.కానీ మీడియా యాజమాన్యంవర్కింగ్ జర్నలిస్ట్ లకు ఏమాత్రం జీతాలు చెల్లిచడం లేదని అన్నారు.సీనియర్ జర్నలిస్ట్ యాదగిరి సంఘం అభివృద్ధి కి పలు సూచనలు, సలహాలు చేశారు. ఈ కార్యక్రమం లో జాతీయ కమిటీ సభ్యులు ఉమామహేశ్వరరావు, మోయజ్, రాష్ట్ర కమిటీ సభ్యులు పరిపూర్ణం, ఎండి రఫీ, అక్బర్ బాష, జిల్లా వర్కింగ్ ప్రసిడెంట్ నర్సింహులు, జిల్లా అధ్యక్షకార్యదర్శులు వాకిట అశోక్, ఎం గోపాల్,ట్రెజరర్ వేణుగోపాల్, సహాయ కార్యదర్శి ఎం.దాసు, డివిజన్ అధ్యక్షుడు ఖలీమ్, ఎలక్ట్రాని మీడియా జిల్లా నాయకులు రవికాంత్, జిల్లా నాయకులు చారి,బాల్ రాజ్,ఆనంద్,రాం మోహన్,సుందర్, తదితరులు పాల్గొన్నారు.