Breaking News

కేంద్ర ప్రభుత్వంపై రైతులు తిరగబడాలి

కేంద్ర ప్రభుత్వంపై రైతులు తిరగబడాలి

సామాజిక సారథి, హలియా : ఎరువుల ధరలు పెంచి రైతు వ్యతిరేక పరిపాలన చేస్తూ రైతులపై భారాన్ని మోపుతున్న కేంద్ర ప్రభుత్వంపై రైతులు తిరగ బడి సరైనా బుద్ధి చెప్పాలని ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు. శుక్రవారం హాలియా లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వ్యవసాయాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్ప చెప్పేందుకు కుట్రలు పన్నుతోందని ఆయన తెలిపారు. రైతులతో పెట్టుకుంటే కేంద్ర ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవు అన్నారు. సాగర్ నియోజకవర్గంలో ఉన్న హాలియా నందికొండ మున్సిపాలిటీలను సుందరీకరణ చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మున్సిపాలిటీల అభివృద్ధి కొరకు ఇంతకుముందు సీఎం కేసీఆర్ ప్రకటించిన 15 కోట్లతో పాటు తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి మరో 10 కోట్లు విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ అంజయ్య,  మున్సిపల్ చైర్మన్ సలహాదారుడు శంకరయ్య, కౌన్సిలర్లు వెంకట్ రెడ్డి, వెంకటయ్య అన్నే పాక శ్రీను, అనుముల మండలం టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కూరాకుల వెంకటేశ్వర్లు, చెరుపల్లి ముత్యాలు, సురభి రాంబాబు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.