Breaking News

రైతాంగ ఉద్యమం చారిత్రాత్మకం

రైతాంగ ఉద్యమం చారిత్రాత్మకం
  •  ఏఐకేఎస్ సీసీ రాష్ట్ర కన్వీనర్ వల్లెపు ఉపేందర్ రెడ్డి

సామాజిక సారథి, వరంగల్: రైతాంగ ఐక్య ఉద్యమం మోడీ ప్రభుత్వ మెడలు వంచి వ్యవసాయ వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయించి చరిత్రను సృష్టించిందని, ఇదే స్ఫూర్తితో మద్దతు ధర, రుణ విముక్తి చట్టాలను సాధించేంతవరకు దశలవారీ పోరాటాలకు సిద్ధం కావాలని ఏఐకేఎస్ సీసీ రాష్ట్ర కన్వీనర్ వల్లెపు ఉపేందర్ రెడ్డి, జిల్లా కన్వీనర్ పెద్దారపు రమేష్, కో కన్వీనర్లు రాచర్ల బాలరాజు, సోమిడి శ్రీనివాస్ లు అన్నారు. శనివారం అఖిల భారత రైతు సంఘాల పోరాట సమన్వయ కమిటీ (ఏఐకెఎస్ సీసీ) ఉమ్మడి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అండర్ బ్రిడ్జ్ నుంచి వరంగల్ బస్టాండ్ వరకు ఢిల్లీ రైతాంగ ఉద్యమ విజయోత్సవ ప్రదర్శన నిర్వహించి మిఠాయిలు పంచారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.  కార్యక్రమంలో జిల్లా నాయకులు నెట్టం నారాయణ, సుద్ధమల్ల భాస్కర్, వల్లందాసు కుమార్, ఎన్రెడ్డి హంసా రెడ్డి, ఎంసీపీఐ(యు) జిల్లా కార్యదర్శి గోనె కుమారస్వామి, న్యూడెమోక్రసీ జిల్లా నాయకుడు బండి కోటేశ్వరరావు, నలిగంటి పాల్ వివిధ ప్రజా సంఘాల నాయకులు పనాస ప్రసాద్, ఓదెల రాజన్న,ఐతం నాగేష్, కర్ర రాజిరెడ్డి, సత్యనారాయణ, మడ్డీ రాజారాం, భాషి పాక అశోక్ లతోపాటు తదితరులు పాల్గొన్నారు.