Breaking News

హమ్మయ్య.. ఆక్సిజన్ ​బండి వచ్చేసింది!

హమ్మయ్య.. ఆక్సిజన్​బండి వచ్చేసింది!

సారథి, హైదరాబాద్: కరోనా సెకండ్​వేవ్​విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఆక్సిజన్​అందక వందల సంఖ్యలో రోగులు చనిపోతున్న విషయం తెలిసిందే. అయితే మూడు నాలుగు రోజులుగా రాష్ట్రంలో 260 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను వినియోగిస్తున్నారు. అయినా సరిపోవడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 360 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను కేటాయిస్తానని చెప్పింది. అందులో 70 టన్నుల వరకు సమకూరింది. మిగితా ఆక్సిజన్ ను బళ్లారి, బిలాయ్, అంగుల్ (ఒడిశా) పెరంబదూర్ నుంచి తీసుకోవాలని కేంద్రం సూచించింది.

తెలంగాణకు అత్యంత సమీపంలోని బళ్లారి స్టీల్ పాయింట్ నుంచి 20 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్​ కేటాయించింది. దూరంగా ఉన్న ప్లాంట్ల నుంచి రోడ్డు మార్గం ద్వారా ఆక్సిజన్ ట్యాంకర్లు రావడానికి కనీసం మూడు నాలుగు రోజుల సమయం పడుతుండడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విమాన సేవలను వినియోగించుకుంటోంది. అందులో భాగంగానే రాష్ట్రానికి వచ్చిన ఆక్సిజన్​సరఫరాను వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. సోమేశ్వర్ కుమార్ పరిశీలించారు.