- రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్
సామాజిక సారథి, నర్సాపూర్: సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అణగారినవర్గాల కోసం ఎనలేని కృషిచేసిన గొప్ప వ్యక్తి అని ఎక్సైజ్‌శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ కొనియాడారు. ఆయన బాటలో ప్రతిఒక్కరూ నడుచుకోవాలని పిలుపునిచ్చారు. సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 371వ జయంతి ఉత్సవాలను బుధవారం మెదక్ జిల్లా నర్సాపూర్ లో ఘనంగా నిర్వహించారు. గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, బీజేపీ నాయకులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో విగ్రహానికి పూలమాల నివాళులర్పించారు. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. సర్వాయి పాపన్న బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి ఎంతో కృషిచేశారని అన్నారు. అనంతరం మల్లేష్‌గౌడ్ మాట్లాడుతూ.. పాపన్న చరిత్రను అందరికీ పరిచయం చేయడం సంతోషంగా ఉందన్నారు. 9 ఏళ్లుగా ఆయన జయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహించడానికి గౌడ సంఘం సభ్యులు ఎంతగానో సహకరిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్సునీతారెడ్డి, ఎమ్మెల్యే మదన్ రెడ్డి, జడ్పీ చైర్మన్ హేమలత శేఖర్, బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జ్గోపి, పాపగారి రమేష్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్అనసూయ అశోక్ గౌడ్, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
రామడుగు ఘనంగా వేడుకలు
సామాజిక సారథి, రామడుగు: సర్దార్ సర్వాయి పాపన్న 371వ జయంతిని కరీంనగర్జిల్లా రామడుగు మండల కేంద్రంలో బుధవారం గీత కార్మికులు, కౌండిన్య యూత్ సభ్యులు ఘనంగా నిర్వహించారు. పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గోల్కొండ కోటను ఏలిన సర్దార్ పాపన్న పౌరుషాన్ని భావితరాల వారు ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం గీత కార్మికులకు గౌడబంధు ప్రవేశపెట్టాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో ప్రెసిడెంట్ అనుపురం తిరుపతిగౌడ్, పొన్నం సత్తయ్య, అనుపురం చంద్రయ్య, పంజాల వెంకటేశ్‌గౌడ్, పురేళ్ల రవీందర్ గౌడ్ పాల్గొన్నారు.