Breaking News

సంఘటిత సమాజమే ధ్యేయం

సంఘటిత సమాజమే ధ్యేయం
  • ఆర్ఎస్ఎస్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలే 

సామాజిక సారథి, నల్లగొండ ప్రతినిధి: సంఘటిత, సమర్థ, స్వాభిమాన భారత్ ను రూపొందించడంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని, ఇదే హిందూ శక్తి సంగమం సందేశమని ఆర్ఎస్ఎస్ సర్ కార్యవాహ దత్తత్రేయ హోసబలే పేర్కొన్నారు. నల్లగొండ జిల్లాకేంద్రంలోని ఎన్జీ కళాశాల మైదానంలో హిందూ శక్తి సంగమం పేరుతో శనివారం నిర్వహించిన జిల్లా మహాసాంఘిక్ సార్వజనికోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అమృతోత్సవాలు నిర్వహించుకుంటున్నామని చెప్పారు. మనదైన సంస్కృతి సంప్రదాయాలు, జీవన విధానం ఆధారంగా ప్రగతిని సాధించడంలో వెనుకబడిపోయామని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ సమయంలోనే జపాన్, ఇజ్రాయెల్ వంటి దేశాలు ఎంతో అభివృద్ధిని, స్వావలంబనను సాదించగలిగాయని గుర్తుచేశారు. భారత్ తన శక్తిసామర్థ్యాలను గుర్తించి అందుకు తగినట్లుగా ముందుకు సాగితే అద్భుతాలు సాధిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో  కంటివైద్య నిపుణులు డా.కస్తూరి నందు ముఖ్య అతిథిగా పాల్గొనగా, ప్రాంత సంఘచాలక్  బూర్ల దక్షిణామూర్తి, నల్లగొండ జిల్లా సంఘచాలక్ ఇటికాల కృష్ణయ్య, తదితరులు ఉన్నారు.