Breaking News

ఉచిత వైద్య శిభిరం విజయవంతం

సామాజిక సారథి, నాగర్ కర్నూల్: బిజినపల్లి మండలం నంది వడ్డెమాన్ గ్రామంలోని జెడ్పీహెచ్ ఎస్ స్కూల్ లో బుధవారం నిర్వహించిన ఉచిత వైద్య శిభిరం విజయవంతం అయ్యింది. ఎన్ఆర్ఐ టి. రాంచంద్రారెడ్డి సహకారంతో ప్రతి ఏటా ఉచిత వైద్య శిభిరం నిర్వహించి నిరుపేద గ్రామీణ ప్రజలకు అండగా ఉంటున్నారు.ఈ నేపథ్యంలో బుధవారం సంపూర్ణ క్యాన్సర్ అవగాహన, నోటి క్యాన్సర్ , మహిళలకు గర్భాశయం, రొమ్ము క్యాన్సర్ పై ఉచిత వైద్య శిభిరం నిర్వహించారు.

ఈ వైద్య శిభిరం లో సుమారు 120 మంది కి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణి చేశారు. వైద్యశిభిరం లో డాక్టర్ శారద, డాక్టర్ హ్యుమేరా, డాక్టర్ థాహా, డాక్టర్ చతుర్వేది లు వైద్య పరీక్షలు నిర్వహించి క్యాన్సర్ పై అవగాహన కల్పించారు. దీంతో పాటు నందివడ్డెమాన్ జెడ్పీహెచ్ ఎస్ స్కూల్ విద్యార్థులకు ప్రొజెక్టర్ ద్వారా క్యాన్సర్ వ్యాధి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ప్రెసిడెంట్ రాజేశ్వర్ రెడ్డి, సర్పంచ్ సుదర్శన్ గౌడ్ , సీనియర్ అడ్వకేట్ వీరశేఖర్ , గ్రామ పెద్దలు చంద్రయ్య , ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు .