- పక్కనే ఉన్న బీఎస్పీ , కాంగ్రెస్ జెండాలకు రంగులు వేసి అధికార పార్టీకి రంగులు వేయని గుడ్ల నర్వ గ్రామపంచాయతీ సిబ్బంది
- సి విజిల్ యాప్ ఫిర్యాదు చేసిన స్పందించని అధికారులు
సామాజిక సారధి , బిజినేపల్లి :సాధారణంగా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎన్నికల నియమావళి ప్రతి పార్టీకి ఒకే రకంగా ఉంటుంది కానీ నాగర్ కర్నూల్ నియోజకవర్గం బిజినపల్లి మండల పరిధిలోని గుడ్ల నర్వ గ్రామంలో మాత్రం అధికార పార్టీకి అది మినహాయింపుగా మారింది . ఇక్కడ సిబ్బంది అధికార పార్టీ కి అండదండలతో బస్టాండ్ ఆవరణలో ఉన్న పార్టీ దిమ్మెలలో బీఎస్పీ , కాంగ్రెస్ దిమ్మెలకు మాత్రం సున్నం వేసి అధికార బీఆర్ఎస్ పార్టీ దిమ్మెకు మాత్రం సున్నం వేయకుండా వదిలేశారు . దీనిపై గ్రామ యువత అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదు . దీంతో ఎన్నికల కమిషన్ కొత్తగా తెచ్చిన సి విజిల్ యాప్ లో కూడా ఫిర్యాదు చేసి మూడు రోజుల పైగా అయినా ఉన్నతాధికారుల నుంచి దీనిపై కనీసం చర్యలు వెలువడ లేదు. దీంతో గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రభుత్వ యంత్రాంగం అంతా అధికార పార్టీకి ఎన్నికలలో వివక్ష చూపిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.