Breaking News

బ్రహ్మకమలాల కనువిందు

బ్రహ్మకమలాల కనువిందు

సారథి, నిజాంపేట: మెదక్ జిల్లా రామాయంపేటలో ఆదివారం సాయంత్రం 8బ్రహ్మకమలాలు వికసించాయి. ఈ పూలను దర్శించిన వారికి మనసులోని కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మెదక్ జిల్లా రామాయంపేట 9వ వార్డు పరిధిలో స్థానిక కౌన్సిలర్ దేవుని జయరాజుకు చెందిన మినరల్ వాటర్ ప్లాంట్ వద్ద ఈ కమలాలు వికసించి కనువిందు చేశాయి. బ్రహ్మకమలం శివుడికి అత్యంత ప్రీతికరమైంది. హిమాలయాల్లో దొరికే ఈ మొక్క ఇంట్లో ఉంటే మంచిదని భావిస్తుంటారు. అందులో భాగంగా రామాయంపేటకు చెందిన జయరాజు కేరళ నుంచి ఈ మొక్కలను తెచ్చి తన మినరల్ వాటర్ ప్లాంట్ వద్ద నాటాడు. చుట్టుపక్కల గ్రామస్తులు వచ్చి బ్రహ్మకమలాలను దర్శించుకున్నారు. ‘కింగ్ ఆఫ్ హిమాలయన్ ఫ్లవర్’ అని ఈ మొక్కను పిలుస్తుంటారు. ఈ మొక్క ఆకులు పూలుగా రూపాంతరం చెందుతాయి. హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మకమలంపై బ్రహ్మదేవుడు కమలాసనుడిగా కూర్చుంటాడు. రాత్రి సమయంలోరెండు గంటల పాటు వికసిస్తుంది. మొక్క యజమాని జయరాజు ఆ పూలను ఎంపీ స్థానిక శివాలయంలో శివుడికి చేశారు. బ్రహ్మకమలాలు తన ఇంట్లో వికసించడం ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు.