- బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్
సామాజిక సారథి, వైరా: ఊరు వాడకు బహుజన జెండాను తీసుకుని వెళ్లి ఏనుగు గుర్తును ప్రతి ఇంటికి పరిచయం చేసి బహుజన రాజ్యమే లక్ష్యంగా పని చేయాలని బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. ఖమ్మంలోని ఓ ఫంక్షన్ హాల్ లో గురువారం రాత్రి జరిగిన బీఎస్పీ జిల్లా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి బీఎస్పీయే ప్రత్యామ్నాయమని అందుకు బహుజనులంతా సైనికుల్లా పని చేసి బీఎస్పీని అధికారంలోకి తేవాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ బీసీలకు 70 సీట్లు కేటాయించటం జరుగుతుందని పేర్కొన్నారు. అనంతరం బీఎస్పీ జిల్లా కార్యదర్శి, వైరా నియోజకవర్గ ఇన్చార్జి నారపోగు ఉదయ్ ఆధ్వర్యంలో వైరా, కారేపల్లి మండలాలకు చెందిన వివిధ సంఘాలు, పార్టీల నాయకులు బీఎస్పీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి ప్రవీణ్ కుమార్ కండువాలు వేసి ఆహ్వానించారు. ఈ సమావేశంలో బీఎస్పీ ఖమ్మం జిల్లా ఇన్చార్జి పుల్లయ్య, జిల్లా అధ్యక్షుడు బుర్ర ఉపేందర్, జిల్లా ఉపాధ్యక్షుడు సీహెచ్. నాగేశ్వరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి పీసీ. వీరస్వామి, వైరా నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి అదెర్ల రాములు, కారేపల్లి మండల అధ్యక్షుడు గులోత్ శివ, వైరా మండల అధ్యక్ష, కార్యదర్శులు మాడుగుల శరత్, కొమ్ము రాంబాబు ,కాంపాటి రవి పాల్గొన్నారు.