సారథి, రామాయంపేట: ఈ ఏడాది వర్షాకాలంలో భారీవర్షాలు కురవడంతో చెరువులు, కుంటలు నిండాయి. రైతులు ఎన్నో ఆశలతో యాసంగి సీజన్ లో వరి సాగుచేయగా, పొట్టదశలోనే బోరుబావులు ఎండిపోతున్నాయి. గత్యంతరం లేక కొందరు రైతులు మురుగు కాల్వల నీళ్లను పంటకు అందిస్తే.. మరికొందరు రైతులు వాటర్ ట్యాంకర్ల సహాయంతో వరి పైరును కాపాడుకుంటున్నారు. మెదక్జిల్లా రామాయంపేట మండలం రాజకపల్లి పంచాయతీ పరిధిలోని కాసింపుర్ తండాకు చెందిన రైతు లౌడ్య రాంచంద్రం కొద్దిరోజులుగా బోరు నీళ్లుపోయడం లేదు. పొట్టదశలో ఉన్న పంటను ఎలాగైనా కాపాడుకోవాలని ట్యాంకర్ లీజుకు తీసుకుని నీళ్లను ఇలా పారిస్తున్నాడు.
- April 5, 2021
- Archive
- medak
- RAMAYAMPET
- rice crop
- మెదక్
- రామాయంపేట
- వరిపంట
- Comments Off on పంటకు ట్యాంకర్ నీరే ఆధారం