సామాజికసారథి, వరంగల్: దివ్యాంగుల సంక్షేమానికి ఎర్రబెల్లి ట్రస్ట్ అనేక కార్యక్రమాలు చేపడుతోందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మంగళవారం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని రాయపర్తి ఎంపీడీవో కార్యాలయంలో దివ్యాంగుల వారోత్సవాలు, ప్రతిభావంతుల పురస్కార ఉత్సవం కార్యక్రమాన్ని ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్, తెలంగాణ వికలాంగుల సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొని కేక్ కట్ చేసి పురస్కారాలు అందజేశారు. ఎర్రబెల్లి ట్రస్ట్ నుంచి ఐదు మోటార్ ట్రై సైకిళ్లను అందజేశామన్నారు. రాయపర్తి మండలంలో ఒక్కో గ్రామం నుంచి అర్హులైన కనీసం ఒక్కరికైనా ట్రై మోటార్ సైకిల్ అందజేస్తామన్నారు. అర్హులైన దివ్యాంగులందరికీ ఏదో ఒక సహాయం తప్పకుండా అందుతుందని మంత్రి భరోసానిచ్చారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, దివ్యాంగులు పాల్గొన్నారు.
- December 15, 2021
- Archive
- Top News
- లోకల్ న్యూస్
- వరంగల్
- దివ్యాంగులకు
- ప్రతిభా
- Comments Off on దివ్యాంగులకు ప్రతిభా పురస్కారాలు