Breaking News

నాగర్ కర్నూలు ఎస్సైపై చర్యలు తీసుకోండి

– యాక్సిడెంట్​ కేసులో ట్రాక్టర్​ ను మార్చారు
– రూ.లక్ష లంచం తీసుకుని బాధితులకు అన్యాయం చేశారు
– డీజీపీకి ఇంద్రకల్​ యువజన సంఘం నాయకుడి వినతి

సామాజికసారథి, నాగర్​ కర్నూల్​ బ్యూరో: యాక్సిడెంట్​ లో ఇద్దరి మృతికి కారణమైన ట్రాక్టర్​, యజమానిని వదిలిపెట్టి మరో వెహికిల్ పై కేసు నమోదుచేసిన ఎస్సైపై చర్యలు తీసుకోవాలని అంబేద్కర్​ యువజన సంఘం ఇంద్రకల్ గ్రామ అధ్యక్షుడు పి.మల్లేష్​ డీజీపీ అరవింద్​ కుమార్​ ను కోరారు. ఈ మేరకు గురువారం వినతిపత్రం అందజేశారు. ఆయన పేర్కొన్న వివరాలు..‘‘నాగర్​ కర్నూల్​ లో ఫిబ్రవరి 3న వేరుశనగ పొట్టులోడుతో వస్తున్న ట్రాక్టర్​(టీఎస్​ 31టీ3491) దేశిటిక్యాల చౌరస్తాలో బైక్​ ను ఢీకొనడంతో అక్కడికక్కడే కొడుకు మృతిచెందగా, తండ్రి చికిత్స పొందుతూ చనిపోయాడు. మృతురాలి బంధువులు ట్రాక్టర్​ డ్రైవర్​ ననిర్లక్ష్యంపై పిర్యాదు చేశారు. నాగర్​ కర్నూల్​ ఎస్సై విజయ్​ కుమార్ కేసు నమోదుచేసి ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్​ ను పదిరోజుల పాటు స్టేషన్​ లో ఉంచారు. ఆ ట్రాక్టర్​ స్థానంలో టీఎస్​ 31 ఎఫ్​టీఆర్​ 1904 నంబర్​ గల మరో ట్రాక్టర్​ ను చూపించి లక్ష రూపాయల లంచం తీసుకునారని తీవ్ర ఆరోపణ లు వొచాయే . ఈ విషయమై మార్చి 30న ‘పోలీసుల మజాకా’ శీర్షికన ‘సామాజికసారథి’ తెలుగు దినపత్రికలో కేసులో ట్రాక్టర్​ ను మార్చిన తీరుపై కథనం వచ్చింది. కానీ విషయంపై పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోలేదు. ఎస్సై తన విధులను దుర్వినియోగం చేస్తూ ఇక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ బెదిరించడం ఆయనకు అలవాటుగా మారింది. మీరైనా స్పందించి చర్యలు తీసుకోండి’’ అంబేద్కర్​ యువజన సంఘం అధ్యక్షుడు పి.మల్లేష్​ డీజీపీ ఆఫీసులో సమర్పించిన వినతిపత్రంలో కోరారు.