Breaking News

సిండికేట్ కిక్కు

సిండికేట్ కిక్కు
  • జోరుగా మద్యం వ్యాపారుల దోపిడీ
  • బినామీ లైసెన్సులతో వ్యాపారం 
  • డబ్బు మత్తులో ఏక్సైజ్ శాఖ 
  • లబోదిబోమంటున్న మద్యం ప్రియులు

సామాజిక సారథి, వెంకటాపురం:  ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో నూతనంగా ఏర్పాటు చేసిన వైన్ షాపులు యజమానులు సిండికేట్ గా మారారు. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించి అధికధరలతో మద్యం విక్రయిస్తూ మద్యం మత్తులో ఉన్న మందుబాబులను డబ్బును దోచేస్తున్నారు. ఒక్కొక్క క్వార్టల్ బాటిల్ పై రూ.20 నుంచి రూ.30 అదనంగా వసూలు చేస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. నూతన మద్యం దుకాణంలో సమయపాలన పాటించకుండా, సీసీ కెమెరాలను,  ధరల పట్టికలను,  ఏర్పాటు చేయకుండా నిబంధనలు తుంగలో తొక్కుతు విచ్చలవిడిగా మద్యం వ్యాపారులు దోపిడీకి తెరలేపారు. ఈ తంతంగమంతా ఎక్సైజ్ శాఖ అధికారులు దృష్టికి వెళ్లినా అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం పలు ఆరోపణలకు తావిస్తోంది. వైన్ షాపుల నుంచి నెలనెలా మాముళ్లు తీసుకోవడమే ఇందుకు కారణమనే బహిరంగంగానే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వెంకటాపురం మండలంలోని వైన్ షాపు యాజమాన్యాలు ఇదే రీతిలో తమ కార్యాకలాపాలు కొనసాగిస్తున్నారు. క్వార్టర్, పుల్ బాటిల్, బీర్ ఇలా ఒక్కొక్క బ్రాండ్ కి ఎంమ్మార్పీ ధరలకంటే, వారికి నచ్చిరేటును అమలు పరుస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి నూతనంగా ఏర్పాటు చేసిన మద్యం దుకాణంలో ఎమ్మార్పీ ధరలతోనే మద్యం విక్రయించడంతోపాటు, వైన్ షాపు ఎదుట ధరల పట్టిక ఏర్పాటు చేయాలని మద్యం ప్రియులు, స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.