సారథి న్యూస్, కొల్లాపూర్: ఈనెల 28న కొల్లాపూర్ లో జరిగే స్వేరోస్ జ్ఞానయుద్ధ భేరి సభను సక్సెస్ చేయాలని స్వేరోస్ ఇంటర్నేషనల్ నెట్వర్క్ సీనియర్ రిసోర్స్ పర్సన్ డాక్టర్ సోలపోగుల స్వాములు కోరారు. శుక్రవారం కొల్లాపూర్ నియోజకవర్గంలో గ్రామ కమిటీల నిర్మాణంలో భాగంగా ఎల్లూర్ గ్రామంలో గడపగడపకు తిరిగి జ్ఞానయుద్ధభేరి సభ ఆవశ్యకతను తెలిపారు. బోరబండతండా, అంజనగిరి తండాల్లో గురుకులాలు, చదువు అవసరాన్ని వివరించారు. నల్లమల అటవీ ప్రాంతంలోని కృష్ణానది ఒడ్డున ఉన్న ఎర్రగట్టు బొల్లారం మొలచింతలపల్లి, ముక్కిడిగుండం, గేమ్య నాయక్ తండా, లచ్చినాయక్ తండా, నార్లాపూర్ గ్రామాల్లో యువకులు, గ్రామాల పెద్దలను సమీకరించి స్వేరోస్ నెట్వర్క్భావజాలం, అంబేద్కర్ ఆశయ సాధనను వివరించారు. అనంతరం వాల్ పోస్టర్లు, స్టిక్కర్లను విడుదల చేశారు. కార్యక్రమంలో వి.మోహన్, బ్రహ్మయ్య, బి.కుర్మయ్య, ఉసేనమ్మ, కోళ్ల శివకుమార్ పాల్గొన్నారు.
- March 5, 2021
- Archive
- Top News
- GURUKULA
- gyna mahasabha
- KOLLAPUR
- RS PRAVEENKUMAR
- SWAEROES
- ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
- కృష్ణానది
- కొల్లాపూర్
- జ్ఞానయుద్ధ భేరి సభ
- నల్లమల
- స్వేరోస్
- Comments Off on 28న స్వేరోస్ జ్ఞానయుద్ధ భేరి సభ