సారథి, రామడుగు: తల్లిదండ్రులు కోల్పోయి అనాథగా మారిన ఎన్నారై ఒకరు సాయం చేశారు. రామడుగు మండలం తీర్మాలపూర్ గ్రామానికి చెందిన చెవుటు వీణాకు రైజింగ్ సన్ యూత్ క్లబ్ అమెరికాకు చెందిన ప్రముఖ ఎన్నారై జమలమడక అమృత సహకారంతో రూ.15వేల ఆర్థిక సహాయం అందజేశారు. యువజన సంఘం సభ్యులు శనివారం ఆమెకు ఇచ్చారు. ఈ సందర్భంగా రైజింగ్ సన్ యూత్ క్లబ్ అధ్యక్షుడు గజ్జెల అశోక్, బాధిత కుటుంబానికి ఆపన్నహస్తం అందించిన ఎన్నారై జమలమడక అమృతకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జేరిపోతు మహేష్, గజ్జెల నవీన్ కుమార్, గడ్డం దినేష్ పాల్గొన్నారు.
- June 12, 2021
- Archive
- ఎన్ఆర్ఐ
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- NRI
- RAMADUGU
- rising sun youth
- ఎన్నారై
- రామడుగు
- రైజింగ్ సన్ యూత్
- Comments Off on అభాగ్యురాలికి ఎన్నారై సాయం