సామాజిక సారథి, వరంగల్: తన భూమిలో అక్రమంగా బోరు వేసిన వారి పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మున్సిపల్ కమిషనర్ కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకొని వికలాంగుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. వరంగల్ నగర పరిధిలోని కాశిబుగ్గ ప్రాంతానికి చెందిన వికలాంగుడైన సయ్యద్ అసద్ కి సంబంధించిన భూమిపై కోర్టు ఇచ్చిన తీర్పు జడ్జ్ మెంట్ ను కూడా తప్పుదోవ పట్టి తన భూమిలో అక్రమంగా బోరు వేశారని అసద్ ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమార్కులు మమ్మల్ని ఎవరు ఏం చేయలేరని, మార్కండేయ అనే వ్యక్తి మున్సిపాల్ అధికారుల అండదండలతో అక్రమంగా బోరు వేశారని తెలిపారు. ఇట్టి విషయాన్ని ఎన్నిసార్లు సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా, పట్టించుకున్న నాధుడు లేడు అని వాపోయాడు. వికలాంగుడిగా పుట్టడమే నేను చేసిన పాపమా అనీ, కోర్టు ఇచ్చిన తీర్పు జడ్జిమెంట్ నీ కూడా పట్టించుకోకుండా తన భూమిలో అక్రమంగా బోర్ వేయడమే కాకుండా వ్యక్తిగతంగా బోరు వేసిన మార్కండేయ అనే వ్యక్తి కి సంబంధించిన వ్యక్తులు వికలాంగుడు అని చూడకుండా మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. తన భూమి లో అక్రమంగా బోరు వేసి నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ సయ్యద్ అసద్ అధికారులకు విజ్ఞప్తి చేశారు..
- December 15, 2021
- Archive
- Top News
- లోకల్ న్యూస్
- వరంగల్
- Disabled
- SUICIDE ATTEMPT
- WARANGAL
- ఆత్మహత్య యత్నం
- వరంగల్
- వికలాంగుడు
- Comments Off on వికలాంగుడి ఆత్మహత్య యత్నం