సామాజిక సారథి ఐజ:
ఐజ మండలం ఎక్లాస్పురం గ్రామానికి చెందిన మల్దకల్ గౌడ్, రాఘవేంద్ర గౌడ్ లకు సంబంధించిన వ్యవసాయ పొలంలో 11 ఎకరాలు చెరుకు పంట సాగు చేయగా మంగళవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు నిప్పంటుకొని చెరుకు తోట దగ్ధమైందని బాధితులు తెలిపారు. మల్దకల్ గౌడ్ 7ఎకరాలు, రాఘవేంద్ర గౌడ్ 5 ఎకరాలు చెరుకు తోట సాగు చేయగా సమీపంలోని రైతులు పొలంలోని చెత్తకు నిప్పు పెట్టడంతో గాలికి చెరుకు చేను అంటుకొని ఫైర్ ఇంజన్ వచ్చేవరకు దగ్ధ మయిందని వారు వాపోయారు. ఆరు కాలం కష్టపడి సాగుచేసిన చెరుకు పంట అగ్ని దేవుడికి ఆహుతి కావడంతో పొలంలోని డ్రిప్పు పైపులు, మోటార్లు కాలిపోయి దాదాపు రూ .15 లక్షలు నష్టం వాటిల్లిందని వారు వాపోయారు. ప్రభుత్వం గుర్తించి తమకు ఆర్థిక సహాయం అందించాలని వారు కోరారు.