సారథి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక భీం దీక్ష కార్యక్రమంలో ఏప్రిల్ 4న కులీ కుతుబ్ షా స్టేడియంలో నిర్వహించే స్వేరో స్వర సునామీ ఆడియో రిలీజ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని స్వేరోస్ సీనియర్ రిసోర్స్ పర్సన్ డాక్టర్ సోలపోగుల స్వాములు కోరారు. ముఖ్యఅతిథిగా స్వేరోస్ నెట్ వర్క్ చైర్మన్, ఫౌండర్, గురుకులాల సెక్రటరీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ హాజరవుతున్నారని తెలిపారు. ఈ మేరకు వారు మైదానంలో ఏర్పాట్లను పరిశీలించారు. బహదూర్ పురా సర్కిల్ ఇన్స్పెక్టర్ డి.దుర్గాప్రసాద్, మలక్‌పేట ఎమ్మెల్యే బలాల, చార్మినార్ ఏసీపీ అంజయ్యను కలిసి స్వర సునామీ కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు. కార్యక్రమంలో సీనియర్ రిసోర్స్ పర్సన్ డాక్టర్ సోల స్వాములు, పైలాన్ కృష్ణ, సంపత్ మహేష్ సంపత్ పాల్గొన్నారు.
- April 2, 2021
- Archive
- Top News
- తెలంగాణ
- malakpet mla balala
- swareo Tsunami
- మలక్‌పేట ఎమ్మెల్యే బలాల
- స్వేరో స్వరసునామీ
- స్వేరోస్
- Comments Off on 4న ‘స్వర సునామీ’ని సక్సెస్ చేయండి