సామాజికసారథి,చిలప్ చెడ్ : మెదక్ జిల్లా చిలప్ చెడ్ మండలం చండూరు గ్రామంలో వీధి కుక్కల స్వైరవిహారంతో పాఠశాలకు వచ్చే విద్యార్థిపై ఒకేసారి మీదికి రావడంతో 6వ తరగతి చదివే విద్యార్థి జీవన్ కు కుక్కలు కలవడంతో గాయాలయ్యాయి. అదేవిధంగా చండూరు గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్థులు స్కూలుకు వస్తుంటే పదో తరగతి విద్యార్థి దాదేసాబ్, ప్రవీణ్ ల వెంబడి కుక్కలు వెంటపడ్డాయి.
జీవన్ కు ప్రథమ చికిత్స పాఠశాల ప్రధానోపాధ్యాయులు చేశారు. అనంతరం తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి చికిత్స నిమిత్తం హాస్పటల్ కు తీసుకువెళ్లారు. గ్రామపంచాయతీ పాలకవర్గం పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి వీధి కుక్కలపై చర్యలు తీసుకోవాలని గ్రామపంచాయతీకి ఎంపీడీవోకు కోరుతున్నామని తెలిపారు.