సామాజిక సారథి, రామకృష్ణాపూర్: డ్రైనేజీ పనుల ప్రారంభించినట్లు మున్సిపల్ చైర్ పర్సన్ జంగం కళ తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ఆమె మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని 17, 19 వార్డుల్లోని శ్రీనివాస్ నగర్, అబ్రహం నగర్ లో డ్రైనేజీ పనులు ప్రారంభించామని తెలిపారు. కాంట్రాక్టర్లు మున్సిపాలిటీ పరిధిలో చేపట్లే పలు అభివృద్ది పనుల్లో వేగం పెంచడంతో పాటు నాణ్యత ప్రమాణాలను పాటించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, వార్డు కౌన్సిలర్ రామిడి ఉమాదేవికుమార్, వార్డు ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
- November 1, 2022
- Archive
- లోకల్ న్యూస్
- Commencement
- Drainage
- Municipality
- ramakrishnapur
- WORKS
- Comments Off on డ్రైనేజీ పనులు ప్రారంభం