సామాజిక సారథి, హుజూరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. ప్రముఖంగా ఇద్దరి మధ్య విజయం దోబూచులాడుతోంది. ఇప్పటికే 8 రౌండ్లు పూర్తయ్యాయి. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ప్రస్తుతం ఆధిక్యంలో ఉన్నారు. 7వ రౌండ్లో బీజేపీ 4,044 (31,027), టీఆర్ఎస్ 3,792 (27,589) ఓట్లు సాధించింది. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు 3,438 ఓట్ల ఆధిక్యం వచ్చింది. అయితే ఉన్నట్టుండి 8వ రౌండ్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్ దూసుకొచ్చారు. 8వ రౌండ్ లో 162 ఓట్ల మెజార్టీ సాధించారు. దీంతో ఈటలకు మెజార్టీ కాస్త తగ్గినట్లయింది.
- November 2, 2021
- Archive
- Top News
- పొలిటికల్
- counting
- ETA
- gellu srinivas
- TRS
- ఈటల
- టీఆర్ఎస్
- హుజూరాబాద్
- Comments Off on రేసులోకి గెల్లు శ్రీనివాస్ యాదవ్