త్వరలో వెంకీ 75వెంకటేష్ 75వ చిత్రం- ‘వెంకీ75’, నిహారిక ఎంటర్టైన్మెంట్ నుంచి ‘ప్రొడక్షన్ నెం.2’ గా రాబోతుంది. ‘శామ్ సింగరాయ్’తో నిర్మాణ రంగంలో అడుగుపెట్టిన నిహారిక ఎంటర్టైన్మెంట్ ఈ ప్రాజెక్ట్‌ని భారీ స్థాయిలో రూపొందించనుంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రీ లుక్ పోస్టర్లో వెంకటేష్ చేతిలో ఏదో పట్టుకున్న సిల్హౌట్ ఇమేజ్ కనిపిస్తోంది. అది గన్ కాదు.. మరి అదేంటో అనే విషయం ఈ నెల 25న తెలుస్తుంది. భారీ పేలుడు, దట్టమైన పొగతో కూడిన ప్రీ-లుక్ పోస్టర్ వెంకటేష్ ఇంటెన్స్ రోల్, సినిమా యాక్షన్ జానర్‌ను సూచిస్తోంది. విన్నింగ్ స్క్రిప్ట్‌ను రాసిన శైలేశ్ కొలను, వెంకటేష్ ను మునుపెన్నడూ చూడని సరికొత్త పాత్రలో ప్రజంట్ చేయనున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో మేకర్స్ అనౌన్స్ చేస్తారు.
- January 24, 2023
- Archive
- CINEMA GALLERY
- Top News
- సినిమా
- Cinema
- NEWAGE CINEMA
- Comments Off on త్వరలో వెంకీ 75వెంకటేష్ 75వ చిత్రం- ‘వెంకీ75′