సారథి న్యూస్, రామాయంపేట: గ్రామాల్లోని చాలా మంది యువకుల్లో రకరకాల నైపుణ్యం ఉన్నప్పటికీ గుర్తించే వ్యవస్థ లేకపోవడంతో వారు అక్కడే ఉండిపోతున్నారని సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి అన్నారు. ఆదివారం మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో సీఎం కేసీఆర్ జన్మదిన సందర్భంగా ఏర్పాటుచేసిన క్రికెట్ టోర్నమెంట్ లో గెలుపొందిన జట్లకు ప్రైజ్ మనీ అందజేసే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గ్రామాల్లో ఇలాంటి టోర్నీలను నిర్వహించడం ద్వారా యువకుల నైపుణ్యం బయటకు రావడంతో పాటు ఈ ఏరియాలో మిగిలిన క్రీడాకారులకు కూడా కొంత ఉత్సాహం నింపినట్లు అవుతుందన్నారు. అనంతరం టోర్నీలో ఫస్ట్ ప్రైజ్ రూ.30వేల నగదు పురస్కారాన్ని మిరుదొడ్డి మండలం లక్ష్మీ నగర్ కు చెందిన జట్టుకు అందజేశారు. రన్నరప్ ప్రైజ్ రూ.15వేలను నిజాంపేట బీ టీంకు అందజేశారు. కార్యక్రమంలో నిజాంపేట జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్, రామాయంపేట జడ్పీటీసీ, వివిధ గ్రామాల సర్పంచ్ లు పాల్గొన్నారు.
- March 7, 2021
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- CM KCR
- CRICKET TOURNEY
- medak
- RAMAYAMPET
- క్రికెట్ టోర్నీ
- మెదక్
- రామాయంపేట
- సీఎం కేసీఆర్
- Comments Off on యువకులను అన్నిరంగాల్లో ప్రోత్సహించాలి