# పక్కా సమాచారంతో బిజినపల్లి పోలీసుల దాడులు
# మద్యం స్వాదీనం
#నిర్వాహకుడు కటికే శేకర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు
సామాజిక సారథి, నాగర్ కర్నూల్: జిల్లా బిజినపల్లి మండలం పాలెం గ్రామంలో రూల్స్ కు విరుద్దంగా బెల్ట్ దుకాణాన్ని నడపడమే గాకుండా ఇండ్ల మధ్య మద్యం బాబులకు సిట్టింగ్ లు ఏర్పాటు చేశారు. ఈ విషయం పై బిజినపల్లి పోలీసులకు పక్కా సమాచారం రావడంతో ఎస్ఐ నాగశేఖర్ రెడ్డి తన సిబ్బందితో కలిసి ఆదివారం అకస్మికంగా దాడులు నిర్వహించారు. రూల్స్ కు విరుద్దంగా పాలెం గ్రామంలో కటికె శేఖర్ అనే వ్యక్తి బెల్టు దుకాణం ఏర్పాటు చేసి మందుబాబులకు ఇండ్ల మధ్యనే సిట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసుల తనిఖీల్లో వెల్లడైంది. గతంలో శేకర్ ను గ్రామస్థులు మహిళలు దేహశుద్ధి చేసిన మార్పు రాలేదు అని అంటున్నారు. ఎన్నికల కోడ్ రావటం తో ఎస్ ఐ నాగశేఖర్ రెడ్డి బెల్టు దుకాణంతో పాటు ఇండ్ల మధ్య సిట్టింగ్ నిర్వహిస్తున్న కటికె శేఖర్ పై కేసు నమోదు చేయడంతో పాటు సుమారు 10 వేల రూపాయల విలువ చేసే మద్యం బాటిళ్లను స్వాదీనం చేసుకున్నారు. పచ్చని పల్లెల్లో బెల్టు దుకాణాలు నిర్వహించి యువతను, ప్రజలకు మద్యానికి బానిసలుగా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు. మద్యం మత్తులో గొడవలు, అల్లర్లు, హత్యలకు దారితీస్తుందని యువత మద్యానికి దూరంగా ఉండాలని ఆయన సూచించారు. బిజినపల్లి మండలంలో ఎక్కడైనా ఎవరైనా చట్ట వ్యతిరేక పనులు నిర్వహిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్ఐ కోరారు.