– హుస్నాబాద్ ఏసీపీ వాసాల సతీశ్
సామాజిక సారథి, హుస్నాబాద్: ఓ కిరాణా షాపులో భారీగా నగదు చోరీకి పాల్పడిన దొంగను అరెస్టు చేసినట్లు ఏసీపీ వాసాల సతీశ్ తెలిపారు. శనివారం హుస్నాబాద్ సర్కిల్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమాశంలో నిందితుడిని ప్రవేశపెట్టి మాట్లాడారు. వివరాల్లోకి వెళితె సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారం (ఎస్) గ్రామంలోని లక్ష్మిప్రసన్న కిరాణంలో అక్టోబర్ 8న ఓ గుర్తు తెలియని వ్యక్తి మోటార్ వెహికిల్ పై తలకు క్యాపు, మూతికి మాస్కు పెట్టుకొని షాపువద్దకు వచ్చి షాపులోని వెల్లుల్లి, ఆయిల్ ప్యాకెట్ తీసుకున్నాడు. ఆ తర్వాత షాపులో ఉన్న మహిళ యజమాని దృష్టి మరల్చి కౌంటర్ లో ఉన్న రూ.10.75000 లక్షల డబ్బును దొంగిలించాడన్నారు. కిరాణా యజమాని బోయిని కనకతార ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడంతో పాటు బాధితులు చెప్పిన నిందితుడి గుర్తుల ఆధారాలను దర్యాప్తు ప్రారంభించామన్నారు. కిరణా షాపులో చోరీకి పాల్పడిన నిందితుడు వరంగల్ జిల్లా చింతల్ కు చెందిన సయ్యద్ యాకూబ్ మోహినుద్దీన్ ఖాద్రి శనివారం పట్టుబడ్డారన్నారు. నిందితుడు ద్విచక్ర వాహనంపై జనగామ, సిద్దిపేట, వరంగల్, జిల్లాలతో పాటు నర్సంపేట, పరకాల, రామగుండం వంటి ప్రాంతాల్లో సంచరిస్తూ కిరాణా షాపు యజమానులకు కొంత డబ్బులిచ్చి సరుకులు కొనుగోలు చేశాక, డబ్బుల తక్కువొచ్చాయని యాజమానులతో వాగ్వాదానికి దిగుతాడని చెప్పారు. ఆ తర్వాత రూ.500 తీసుకెళ్తాతాడని చెప్పారు. ఇదే తరహాలో షాపుయజమాని దృష్టి మళ్లించి షాపులోని డబ్బును సైతం ఎత్తుకెళ్ళడం అతని దినచర్యగా మారిందన్నారు. పర్వతగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇదే తరహా యజమాని దృష్టి మళ్లించి రూ.30వేల దొంగతనం కేసు నమోదైందన్నారు. నేరస్తుడు మోహినుద్దీన్ నేరం ఒప్పుకోవడంతో 1.7000 లక్షల నగదును రికవరీ చేసి, నిందితున్ని రిమాండ్ చేసినట్లు ఏసీపీ పేర్కొన్నారు. కేసు చేదించిన సీఐ రఘుపతిరెడ్డి, ఎస్సై సజ్జనపు శ్రీధర్, కానిస్టేబుళ్లు రవి, సతీష్, చంద్రశేఖర్లను అభినందించారు.