– కన్నుల పండువగా శ్రీ వెంకటేశ్వర అలివేలు మంగమ్మ కళ్యాణోత్సవం
ఎమ్మెల్యే తరపున పట్టు వస్త్రాల అందజేత
సామాజిక సారథి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం పాలెం గ్రామంలో బుధవారం శ్రీ వెంకటేశ్వర అలివేలు మంగమ్మ కళ్యాణోత్సవం కన్నుల పండువగా జరిగింది. వేదపండితుల వేదమంత్రోచ్చరణాల మధ్య, అశేష జనం, భక్తుల మధ్య స్వామివారి కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి స్వామి వారి కళ్యాణోత్సవానికి పట్టువస్త్రాలను పంపించారు. ఆలయ అర్చకులకు, అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి పంపిన పట్టు వస్త్రాలను గ్రామస్తులు గంగు కృష్ణవేణి , గంగు ప్రవీణ్ , కాంగ్రెస్ పార్టీ నాయకులు గోవిందు, రామకృష్ణ, ఉపసర్పంచి రాములు అందజేశారు. కార్యక్రమంలో జయ కృష్ణ , ఆలయ మాజీ చైర్మన్ శేఖర్ రెడ్డి , సభ్యులు నారాయణరెడ్డి , సురేందర్ రెడ్డి , గంధం వెంకటేశ్వర్లు , సొప్పరి బాలస్వామి తదితరులున్నారు .