సారథి, రామడుగు: రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మాజీమంత్రి ఈటల రాజేందర్ పై అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని, ముదిరాజ్ ల పవర్ ఏందో చూపిస్తామని ముదిరాజ్ మహాసభ నాయకులు హెచ్చరించారు. శనివారం కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని ముదిరాజ్ భవన్ లో ఈటల రాజేందర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో అలుపెరుగని పోరాటం చేసిన నాయకుడు, మచ్చలేని మంచి మనిషి ముదిరాజ్ ల ఆరాధ్యదైవం అని కొనియాడారు.
ఒక బీసీ నేత రాష్ట్ర మంత్రి స్థాయికి ఎదిగిన తీరును చూసి సీఎం కేసీఆర్ కుటుంబం జీర్ణించుకోలేకపోతుందన్నారు. ఈటల రాజేందర్ ను తప్పించేందుకు పక్కాప్లాన్ తో భూ కబ్జాఆరోపణలు అంటగట్టారని మండిపడ్డారు. రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతం ఉన్న ముదిరాజ్ కులస్తుల ఓట్లతోగెలిచిన సీఎం కేసీఆర్ కు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధిచెబుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ నాయకులు బొమ్మరవేని తిరుపతి, మామిడి కుమార్ మామిడి అంజయ్య, పెసరి తిరుపతి, నీలం చిన్న బొమ్మరవేని మల్లేశం, బాసవేని శ్రీను, అరుణ్, నీలం అంజయ్య, కీర్తి కిషోర్, ఉత్తేమ్, శ్రీనివాస్, నరేష్, బొమ్మరవేని అనిల్ మామిడి దిలీప్, చిటల నాగయ్య మామిడి నర్సయ్య, ముదిరాజ్ యువజన, సంఘం నాయకులు పాల్గొన్నారు.