సారథి, పెద్దశంకరంపేట: ప్రభుత్వం నిర్ధేశించిన లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వస్త్రదుకాణాన్ని మెదక్ జిల్లా పెద్దశంకరంపేట ఎస్సై నరేందర్ సోమవారం సీజ్ చేసినట్లు ప్రకటించారు. పెద్దశంకరంపేటలో ఉదయం 10 గంటల తర్వాత దుకాణం తెరిచి ఉండటంతో ఎండీ ఆబిద్ హుస్సేన్ క్లాత్ మర్చంట్ దుకాణాన్ని సీజ్ చేశారు. లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రజలు అత్యవసర పని ఉంటేనే బయటికిరావాలని సూచించారు. నాందేడ్ అకోలా -హైదరాబాద్ 161వ జాతీయ రహదారిపై తనిఖీలు చేశారు. లాక్ డౌన్ కు ప్రజలంతా సహకరించాలని కోరారు. ఆయన వెంట పోలీస్ సిబ్బంది ఉన్నారు.
కరోనా పట్ల జాగ్రత్తలు పాటించాలి
గ్రామీణప్రాంతాల్లో ప్రజలంతా కరోనా నివారణకు తగిన జాగ్రత్తలు పాటించాలని పేట ఐసీడీఎస్ సూపర్ వైజర్ శ్రీశైల సూచించారు. సోమవారం పెద్దశంకరంపేటలోని పూసల గల్లీ 9వ అంగన్ వాడీ సెంటర్ వీధిలో ఇంటింటి సర్వేలో ఆమె పాల్గొన్నారు. ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని సూచించారు. ఆమె వెంట అంగన్ వాడీ టీచర్ సరళ, వైద్యసిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు పాల్గొన్నారు.