హైదరాబాద్: తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్లి.. రాజన్న సంక్షేమ ఫలాలతో ఆయన పాలన తేవాలని భావిస్తున్న వైఎస్ షర్మిల కీలక ప్రకటన చేశారు. తన రాజకీయ అరంగేట్రంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఏ పార్టీకి ఏజెంట్ ను కాదని, ఎవరితోనూ పొత్తు అక్కర్లేదని, టీఆర్ఎస్, బీజేపీ అడిగితే రాజకీయాల్లోకి రాలేదని స్పష్టంచేశారు. ఏ పార్టీతోనూ తనకు సంబంధం లేదని తేల్చిచెప్పారు. గురువారం హైదరాబాద్ లోటస్ పాండ్ లో తనను అభిమానులు కలిసిన సందర్భంగా మాట్లాడారు. జిల్లాలో ఏప్రిల్ 9న నిర్వహించే సంకల్పసభకు ఎంతో ప్రాధాన్యం ఉందన్నారు. అదే రోజన తన తండ్రి వైఎస్సార్ పాదయాత్ర ప్రారంభించారని, ఆ రోజున మొదటి అడుగు వేయాలని నిర్ణయించినట్లు వైఎస్ షర్మిల స్పష్టంచేశారు.
- March 26, 2021
- Archive
- Top News
- పొలిటికల్
- lotuspond
- YS JAGAN
- YS SHARMILA
- YSR
- లోటస్పాండ్
- వైఎస్ జగన్
- వైఎస్ఆర్
- షర్మిల
- సంకల్పసభ
- Comments Off on పార్టీ ప్రకటనపై షర్మిల కీలక వ్యాఖ్యలు