#ఒకే సారి మూడు గవర్నమెంట్ జాబ్స్ కు ఎంపిక
#సత్తా చాటిన బిజినపల్లి మండలం పాలెం మహిళ
సామాజిక సారథి, నాగర్ కర్నూల్:ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే గగనం. అలాంటిది ఒకవైపు పై చదువులు చదువుకుంటు, మరొక వైపు ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతూ ఏకంగా ఒకేసారి మూడు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించింది ఓ మహిళ. నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం పాలెం గ్రామానికి చెందిన టీ. శైలజ గురుకుల ఉద్యోగాలలో ఏకంగా మూడు ఉద్యోగాలను సాధించి తన సత్తా చాటుకుంది. బిజినపల్లి మండలం పాలెం గ్రామానికి చెందిన టి.శైలజ వనపర్తి కి చెందిన ఓ యువకుడితో వివాహం జరిపించారు. ప్రస్తుతం భర్త ప్రోత్సాహంతో శైలజ ఓ వైపు ఉన్నత చదువులు చదువుతూనే మరొక వైపు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతోంది. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు పాలెం లోని తోటపల్లి శుభ్రమణ్యం మెమోరియల్ హైస్కూల్ లో చదివి ఇంటర్ చదువుతుండగానే వివాహం చేయడం తో వనపర్తి లో భర్తతో కలిసి నివసిస్తోంది. వనపర్తి లో ఇంటర్ పూర్తి చేయడంతో పాటు డిగ్రీ, బీఈడీ లు కూడా ఇక్కడే పూర్తి చేసింది. అనంతరం హైద్రాబాద్ ఉస్మానియా యూనివర్శిటీలో కోటీ మహిళా పీజీ కాలేజీలో పీజీ పూర్తి చేసింది. ఆ తర్వాత గురుకుల ఉద్యోగాల నోటీఫికేషన్ రావడంతో కష్టపడి చదివి ఏకంగా గురుకుల పీజీటీ, టీజీటీ, జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలను సాధించి తన సత్తా చాటింది. భర్త ప్రోత్సాహంతో ఓ వైపు ఇంటి పనులు చేసుకుంటూనే ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న లక్ష్యంతో కసిగా చదివింది. తాను పడిన కష్టానికి ఏకంగా మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడంతో ఎంతో ఆనందంగా ఉందని శైలజ తెలిపారు. ప్రాథమిక విద్యాబ్యాసం పూర్తి చేసిన పాలెం గ్రామంలోనూ చిన్ననాటి స్నేహితులు, కుటుంభ సభ్యులు ,గ్రామస్థులు శైలజకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
- March 2, 2024
- Archive
- Top News
- 3govt jobs
- TELANGANA
- తెలంగాణ
- Comments Off on శైలజ తీన్ మార్