Breaking News

22న నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ అవగాహన సదస్సు

22న నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ అవగాహన సదస్సు

సామాజికసారథి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ మందిరంలో నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్, ఎన్జీవోస్ ప్రతినిధులతో నాగర్​ కర్నూల్​ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ బుధవారం సమీక్షించారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఈనెల 22న తేదీన నిర్వహించబోయే సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ స్కీంపై అవగాహన సదస్సుకు సరైన ప్రణాళికలతో సిద్ధం కావాలని అధికారులకు ఎమ్మెల్యే రాజేష్​ రెడ్డి సూచించారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పలు పథకాలపై నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్, ఎన్జీవో ఆధ్వర్యంలో నిర్వహించే అవగాహన సదస్సుకు తగిన ఏర్పాట్లు, తదితర అంశాలపై అధికారులకు కలెక్టర్​ పలు సూచనలు చేశారు. పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు నిరుద్యోగ యువతకు, ప్రభుత్వాలు అందించే పథకాలపై పూర్తిగా అవగాహన కల్పించే విధంగా అధికారులు సమాయత్తం కావాలని కోరారు. కార్యక్రమంలో ఎన్జీవోస్ ప్రతినిధి వెంకట్, నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ చీఫ్ మేనేజర్లు చాగంటి, సురేష్, మేనేజర్ అశ్విని కుమార్, ఎల్ డీఎం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.