సామాజిక సారథి, హుజూరాబాద్: రాష్ట్రమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హుజూరాబాద్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటికే రెండు రౌండ్లు పూర్తయ్యాయి. మధ్యాహ్నం వరకు హుజూరా‘బాద్షా’ ఎవరో స్పష్టత రానుంది. కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్ డిగ్రీ కాలేజీలో ఓట్ల కౌంటింగ్ కొనసాగుతోంది. ఈసారి గతంలో లేనంతగా రికార్డు స్థాయిలో 86.64 శాతం పోలింగ్ నమోదైంది. కౌంటింగ్ ఏర్పాట్లను కలెక్టర్ ఆర్వీ కర్ణన్, కమిషనర్ సత్యనారాయణ పరిశీలించారు. అయితే సెకండ్ రౌండ్లోనూ కూడా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 358 ఓట్ల లీడ్లో ఉన్నారు. రెండు రౌండ్లలో కారు గుర్తును పోలిన రోటీ మేకర్ కు 158 ఓట్లు పడ్డాయి. రెండో రౌండ్ ఓట్ల లెక్కింపు తర్వాత టీఆర్ఎస్ కు 4,659 (9103), బీజేపీకి 4,851 (9461) కాంగ్రెస్ కు 339 వచ్చాయి. ప్రస్తుతం బీజేపీ 192 (358)ఓట్ల ఆధిక్యంతో ఉంది. 3వ రౌండ్ ముగిసేసరికి బీజేపీ (911+358) 1,269 లీడ్లో ఉంది. నాలుగవ రౌండ్ ఓట్ల లెక్కింపు కూడా పూర్తయింది. బీజేపీ లీడ్ 1,825 రాగా, మొత్తంగా 2,542 ఓట్లతో ముందంజలో ఉంది.
- November 2, 2021
- Archive
- Top News
- షార్ట్ న్యూస్
- counting
- ETA
- gellu srinivas
- TRS
- ఈటల
- టీఆర్ఎస్
- హుజూరాబాద్
- Comments Off on బ్రేకింగ్.. సెకండ్.. థర్డ్.. ఫోర్త్.. బీజేపీ దూకుడు