Breaking News

‘ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ మాలలకి ఇవ్వాలి’

‘ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ మాలలకి ఇవ్వాలి’

 సామాజిక సారథి, హన్వాడ: ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గా మాలలకు ఇవ్వాలని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి నర్సింహ్మయ్య డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలో మండల కార్యాలయంలో మండల అధ్యక్షుడు గుంత లక్ష్మయ్య తో కలిసి మాట్లాడారు. గతంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ రెండు పదవులను మాదిగ సామాజిక వర్గానికి ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవిని మాదిగ సామాజిక వర్గానికి ఇచ్చి మానవులకు తీవ్ర అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ పదవి అయిన మాలలకి ఇచ్చి న్యాయం చేయాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మిట్టమీది బాలరాజ్, మండల అధ్యక్షుడు గుంత లక్ష్మయ్య, మండల ప్రధాన కార్యదర్శి దర్పల్లి బాలకృష్ణయ్య, మండల ఉపాధ్యక్షుడు దర్పల్లి అంజనేయులు, కారంగి లక్ష్మీనారాయణ, హన్వాడ గ్రామ అధ్యక్షుడు కావలి రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.