సామాజిక సారథి, అచ్చంపేట: అప్పులబాధలతో నాగర్కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం కాంసానిపల్లి తండా మహిళా సర్పంచ్ భర్త రవి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గురువారం స్థానికంగా కలకలం రేపింది. తండాలో వైకుంఠధామాలు, డంపింగ్ యార్డు పనులు చేసి అప్పుల పాలయ్యాడు. అందుకోసం సుమారు రూ.8లక్షల అప్పుచేశాడు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్కు తరలించారు. చేసిన పనులకు బిల్లులకు రాకపోవడం, అప్పులు ఇచ్చినవారు డబ్బులు ఇవ్వమని వారు బలవంతం పెట్టడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేసుకున్నారని కుటుంబసభ్యులు, స్థానికులు తెలిపారు.
- September 9, 2021
- Top News
- ACHAMPET
- TRS
- uppununthala
- అచ్చంపేట
- ఉప్పునుంతల
- టీఆర్ఎస్
- Comments Off on అప్పులబాధతో సర్పంచ్ భర్త ఆత్మహత్యాయత్నం