సామాజికసారథి, తాడూరు: ఓ పంచాయితీ విషయంలో దివ్యాంగుడిపై సర్పంచ్ప్రతాపం చూపించాడు. సర్దిచెప్పాల్సింది పోయి సదరు వ్యక్తిపై పిడిగుద్దులకు దిగాడు. దీంతో ఆయన దవడ దెబ్బతినడంతో లబోదిబోమంటున్నాడు. ఈ ఘటన గురువారం తాడూరు మండలం అల్లాపూర్‌లో చోటుచేసుకున్నది. బాధితుడి కథనం మేరకు.. గ్రామానికి చెందిన దివ్యాంగుడు ఆవుల తిరుపతయ్య భిక్షాటన చూస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతని సోదరుడి కుమారుడు బాలకృష్ణ, అదే గ్రామానికి చెందిన శాంతయ్య గొడవపడ్డారు. ఈ విషయమై ఆవుల తిరుపతయ్యతో మాట్లాడేందుకు గ్రామ సర్పంచ్ జి.నిరంజన్ పిలిపించాడు. ఈ ఘటనతో తనకు సంబంధం లేదని తిరుపతయ్య చెప్పాడు. మాటామాట పెరగడంతో ఇంతలో సర్పంచ్ జి.నిరంజన్.. దివ్యాంగుడైన తిరుపతయ్యపై ముష్టిఘాతాలు కురిపించాడు. దీంతో ఆయన దవడ పళ్లు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ విషయమై బాధితుడు తిరుపతయ్య జిల్లా ఎస్పీకి ఫోన్లో ఫిర్యాదు చేశాడు. తాడూరు ఎస్సైకి కూడా ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసు అధికారులు విచారణకు ఆదేశించారు.
- May 19, 2022
- Archive
- Allapur
- NAGARKURNOOL
- TADUR
- అల్లాపూర్
- తాడూరు
- నాగర్‌కర్నూల్
- సర్పంచ్దాడి
- Comments Off on దివ్యాంగుడిపై సర్పంచ్ దాష్టీకం