సారథి, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని తిర్మలాపూర్ గ్రామంలో శుక్రవారం సర్పంచ్ బక్కశెట్టి నర్సయ్య కరోనా బాధిత ఆరు కుటుంబాలకు వారానికి సరిపడా నిత్యవసరాలు, కూరగాయలు, బియ్యం, కోడిగుడ్లు పంపిణీ చేసి ఉదారత చాటుకున్నాడు. ఎవరు భయపడకుండా డాక్టర్లు సూచించిన మందులు వాడాలని ఆయన సూచించారు. మెడిసిన్ వాడుతూనే పౌష్టికాహారం తీసుకోవాలని కోరారు. గోపాల్ రావుపేట ఏఎంసీ వైస్ చైర్మన్ తడగొండ అజయ్, పంచాయతీ కార్యదర్శి శిరీష్, టీఆర్ఎస్ నాయకులు తడగొండ నర్సింబాబు, ఆశావర్కర్లు, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
- April 30, 2021
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- CARONA
- RAMADUGU
- second wave
- కరోనా సెకండ్ వేవ్
- రామడుగు
- సరుకులు పంపిణీ
- Comments Off on కరోనా బాధితుల పట్ల సర్పంచ్ ఉదారత