సారథి, చొప్పదండి: కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం కొలిమికుంట గ్రామంలో పల్లెప్రగతి పనులను జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య ఆదివారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రహదారుల ఇరువైపులా మొక్కలు నాటాలని సూచించారు. ప్రతి ఆవరణలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి గ్రామస్తులను కోరారు. ప్రతి ఇంటికి ఆరు మొక్కలు ఇవ్వాలని ఆదేశించారు. గ్రామాల్లో పెండింగ్ పనులు ఉండకూడదని సూచించారు. ఆయన వెంట సర్పంచ్ తాళ్లపల్లి సుజాత శ్రీనివాస్ గౌడ్, ఎంపీపీ చిలుక రవిందర్, ఎంపీటీసీ తోట కోటేశ్, స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీవో జగన్మోహన్ రెడ్డి, ఏఈవో అనిల్ రెడ్డి, సెక్రటరీ ప్రవళిక, అంగన్వాడీ కార్యకర్తలు మల్లీశ్వరి, లావణ్య, సీఏ గంగా, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.
- July 4, 2021
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- CHOPPADANDI
- KARIMNAGAR
- PALLEPRAGATHI
- కరీంనగర్
- చొప్పదండి
- పల్లెప్రగతి
- Comments Off on పారిశుద్ధ్యం అందరి బాధ్యత