-ఇసుక మాఫీయా దాష్టీకం- ఇసుక రవాణాను
-అడ్డుకున్న యువకుడిపై దాడి తీవ్ర గాయాలు
-పోలీసులను నిలదీసిన ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి
సామాజికసారథి, నాగర్ కర్నూల్ : ఇసుక రవాణను అడ్డుకున్నందుకు ఇసుక మాఫీయా దాష్టీకం ప్రదర్శించింది. మా ఊరు వాగు నుంచి ఇసుకను ఎందకు కొడుతున్నారని నిలదీశింనందుకు ఓ యువకుడిని తలపగేలా చితకబాదింది. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం మేడిపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. బాధితుడి కథనం… మేడిపూర్ గ్రామానికి చెందిన ప్రభాకర్ అనే యువకుడు గ్రామ సమీపంలోని దుందుభీ నది నుంచి ఇసుకను రవాణా చేస్తుండగా అడ్డుకున్నారు. కాగా దుందుభీ నది నుంచి ఇసుక మాఫీయా గతకొద్ది రోజులుగా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తుంది. రాత్రివేళ గ్రామస్తుల కండ్లు కప్పి దుందుబీ వాగును కొల్లగాడుతున్నారు. ఈ క్రమంలో బుధవారం ప్రభాకర్ అనే యువకుడు అడ్డుకోగా దాడి చేశారు.
ఈ విషయమై స్టేషన్ కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా, ‘నీవెందుకు ఇసుకను అడ్డుకున్నావని పోలీసులు చెంపపై ఛెల్లున కొట్టారు.. నానాబూతులు తిట్టారు’ అని ప్రభాకర్ వాపోయాడు. అనంతరం బాధిత యువకుడు ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డికి ఫిర్యాదు చేశాడు. ఆయన స్టేషన్ కు వెళ్లి వెళ్లి పోలీసులను నిలదీశారు. కాగా, ఈ విషయంపై ‘సామాజిక సారథి ప్రతినిధి’ ఎస్ఐ రామన్ గౌడ్ ను వివరణ కోరగా ఇసుక రవాణాను యువకుడి అడ్డుకునే హక్కు లేదు కాదా..? ఎలా అడ్డుకుంటాడని చెప్పడం గమనార్హం. ఒకవేళ ఇసుక రవాణాను అడ్డుకునే అధికారం రెవెన్యూ, మైనింగ్ వాళ్లకు మాత్రమే ఉందని చెప్పకొచ్చారు. పోలీసుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.