సారథి న్యూస్, రామయంపేట: సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు మార్చి తర్వాత సొంత జాగా ఉండి ఇల్లు కట్టుకుంటే రూ.ఐదు లక్షల ఆర్థిక సహాయం అందజేస్తామని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ప్రకటించారు. సోమవారం ఆమె నిజాంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. కరోనా సమయంలో రాష్ట్రానికి ఆదాయం తగ్గడంతో ఆసరా పింఛన్లు అందించడంలో ఆలస్యమైందన్నారు. మార్చి తర్వాత మండల కేంద్రంలో రెండెకరాల విస్తీర్ణంలో ఎంపీడీవో, తహసీల్దార్ ఆఫీసులను నిర్మిస్తామని చెప్పారు. అనంతరం మండలంలోని చల్మేడ గ్రామంలో దోమ తెరలను పంపిణీ చేశారు. అలాగే గ్రామంలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, ప్రకృతివనాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీపీ సిద్ధరాములు, జడ్పీటీసీ విజయ్ కుమార్, వైస్ ఎంపీపీ అందె ఇందిర, వివిధ గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
- January 25, 2021
- Archive
- Top News
- తెలంగాణ
- Comments Off on ఇల్లు కట్టుకంటే రూ.5లక్షల సాయం