సామాజిక సారథి, హైదరాబాద్: రాచకొండ కమిషనరేట్ పరిధిలో భారీగా గంజాయి పట్టుబడింది. కమిషనరేట్ పరిధిలో 1,820 కిలోల గంజాయి పట్టుకున్నట్లు రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. దీని విలువ రూ.3 కోట్లకు పైగా ఉంటుందని చెప్పారు. గంజాయి తరలిస్తున్న ఐదుగురు సభ్యుల అంతర్ రాష్ట్ర ముఠాను అరెస్టు చేశారు. గంజాయి రవాణాకు వినియోగించిన పది టైర్ల లారీ, కారును సీజ్ చేశారు. ఆంధప్రదేశ్ లోని విశాఖపట్నం సమీపంలో ఉన్న సీలేరు నుంచి మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తున్నారని పోలీసులు చెప్పారు. పూర్తి వివరాలపై దర్యాప్తు ప్రారంభించామని కమిషనర్ పేర్కొన్నారు.
- November 26, 2021
- Archive
- Top News
- క్రైమ్
- ARREST
- cannabis
- POLICE
- RACHAKONDA
- Rs. 3 crore
- smuggling
- అరెస్టు
- గంజాయి
- పోలీసులు
- రాచకొండ
- రూ. 3కోట్ల
- స్మగ్లింగ్
- Comments Off on రూ.3కోట్ల విలువైన గంజాయి పట్టివేత