Breaking News

పెట్రోల్‌ పై రూ.25 తగ్గింపు

పెట్రోల్‌పై రూ.25 తగ్గింపు
  • ఖార్ఖండ్​ ప్రభుత్వం కీలక నిర్ణయం
  • హర్షం వ్యక్తం చేస్తున్న వాహనదారులు

రాంచి: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా పెరిగినవేళ జార్ఖండ్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వంద దాటిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిరోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది. పెట్రోల్‌ పై రూ.ఐదు, డీజిల్‌ పై రూ.10 తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది. కేంద్రం తగ్గించిన ధరలకు అనుగుణంగా అనేక రాష్ట్రాలు కూడా పెట్రోల్‌ ధరలను తగ్గించాయి. ఈ క్రమంలో జార్ఖండ్​ప్రభుత్వం వాహనదారులకు మరో గుడ్‌న్యూస్‌ చెప్పింది. పెట్రోల్‌ ధరలను భారీగా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.  లీటర్‌ పెట్రోల్‌పై రూ.25 తగ్గిస్తూ సీఎం హేమంత్‌ సోరెన్‌ ప్రకటించారు. తగ్గించిన ధరలు జనవరి 26 నుంచి అమలులోకి వస్తాయని తెలిపారు. సీఎం హేమంత్‌ సోరెన్‌ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అక్కడి ప్రజలు స్వాగతిస్తున్నారు. కరోనా మహమ్మారి తర్వాత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు పెట్రోల్‌ ధరలపై పన్నులు పెంచారు. అంతేకాదు, ఒపెక్‌ ప్లస్‌ దేశాలు ముడిచమురు ఉత్పత్తిని భారీగా తగ్గిస్తూ గతంలో నిర్ణయం తీసుకోవడంతో ధరలు పెరిగిపోయాయి. జార్ఖండ్‌ సీఎం సాహాసోపేతమైన నిర్ణయం తీసుకోవడంతో స్థానిక వాహనాదారులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.