సామాజిక సారథి, రామడుగు: ఎస్సీలతో బీసీలు, మైనార్టీలకు కూడా దళితబంధు మాదిరిగానే ప్రత్యేక పథకం అమలు చేయాలని కరీంనగర్ జిల్లా రామడుగు మండల బీజేపీ నాయకులు కోరారు. ఓబీసీ మోర్చా అధ్యక్షుడు దూలం కళ్యాణ్, మేకల లక్ష్మణ్, బీజేపీ మండలాధ్యక్షుడు ఒంటెల కరుణాకర్ రెడ్డి, జిల్లా ఓబీసీ కార్యవర్గ సభ్యుడు తీర్మాలపూర్ ఎంపీటీసీ మోడీ రవీందర్ తదితరులు బీసీబంధు దరఖాస్తు ఫారాన్ని బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎస్సీ, బీసీ, మైనార్టీలను టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. అందరికీ రూ.10లక్షల ఆర్థిక సహాయం అందజేయాలన్నారు. కార్యక్రమంలో ఓబీసీ మోర్చా మండల ఉపాధ్యక్షుడు చింతపంటి బాలు, ఓబీసీ మండల కార్యదర్శి సింగసాని మల్లేశం, మండల అధికార ప్రతినిధి పోచంపల్లి నరేష్, ఇనుగుర్తి నాగరాజు, బక్కశెట్టి శ్రీకాంత్, సంజీవ్, మాడిశెట్టి అనిల్, మాడిశెట్టి శ్రీనివాస్, రాగం కనకయ్య, బొజ్జ తిరుపతి, జయంత్, సముద్రాల రవి పాల్గొన్నారు.
- August 18, 2021
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- BJP
- dalitha bandhu
- RAMADUGU
- ఓబీసీ మోర్చా
- దళితబంధు
- రామడుగు
- Comments Off on బీసీలకూ రూ.10లక్షలు ఇవ్వాలి