Breaking News

రౌడీషీట్లు ఎత్తివేయాలి హోంమంత్రిని కలిసిన ఎమ్మెల్యే

రౌడీషీట్లు ఎత్తివేయాలి హోంమంత్రిని కలిసిన ఎమ్మెల్యే

సామాజిక సారథి, హలియా: ఉద్యమకారులపై రౌడీషీట్లను ఎత్తివేయాలని ఎమ్మెల్యే నోముల భగత్ హోంమంత్రి మహమూద్ అలీకి వినతిపత్రం సమర్పించారు. హైదరాబాద్ మంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి  ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారులపై పోలీసులు పెట్టిన రౌడీషీట్లను ఎత్తివేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి కలిసి వినతిపత్రం అందజేశారు. మంత్రి సానుకూలంగా స్పందిస్తూ రౌడీషీట్లు ఎత్తివేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని భగత్ తెలిపారు. హోంమంత్రికి వినతి పత్రం సమర్పించేందుకు పలువురు ఉద్యమకారులు అభినందనలు తెలియజేశారు.