- సీఎం కేసీఆర్ కు రేవంత్ ట్వీట్
సామాజిక సారథి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ఉచిత ఎరువుల పంపిణీ హామీని నిలుపుకోవాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి శుక్రవారం ట్విట్టర్వేదికగా డిమాండ్ చేశారు. 2017 ఏప్రిల్ 13న ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు ఉచితంగా ఎరువులు ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. ఆ హామీ ఇచ్చి నాలుగేళ్లు అయినా ఇంతవరకు అమలు చేయలేదని, ఆ హామీని పూర్తిగా విస్మరించారన్నారు. మీరు, మీ మంత్రులు ఛాలెంజ్ చేసి, చర్చల నుంచి తప్పించుకునే బదులు కనీసం రైతులకు ఇచ్చిన హామీలనైనా అమలు చేయాలని రేవంత్రెడ్డి ట్విట్టర్ ద్వారా కోరారు.