సారథి, మానవపాడు: కేవలం ఏడు నిమిషాల్లోనే భూమి రిజిస్ట్రేషన్ కావడంపై వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సంతోషం వ్యక్తంచేశారు. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు తహసీల్దార్ కార్యాలయానికి ఓ సాధారణ వ్యక్తిలా వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ధరణి రైతులకు ఒక వరమని, మధ్యవర్తులు, బ్రోకర్ల ప్రమేయం లేకుండా మీ సేవకు వెళ్లి ధరణి పోర్టల్ లో ఆన్లైన్చేసుకుంటే ఈజీగా రిజిస్ట్రేషన్అయిందని గుర్తుచేశారు. ధరణి సేవలను తెలుసుకునేందుకే సాధారణ వ్యక్తిలా వచ్చానని తెలిపారు.
- March 30, 2021
- Archive
- DHARANI
- JOGULAMBA GADWALA
- MEESEVA
- జోగుళాంబ గద్వాల
- ధరణి
- మంత్రి నిరంజన్ రెడ్డి
- మీసేవ
- Comments Off on 7 నిమిషాల్లో రిజిస్ట్రేషన్.. హ్యాపీ