సారథి న్యూస్, రామాయంపేట: రైతు వేదికలను రైతుశిక్షణ కేంద్రాలుగా ఉపయోగించుకోవాలని మండల వ్యవసాయ అధికారి సతీష్ సూచించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని నస్కల్ గ్రామంలో గురువారం రైతువేదికలో రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాసంగి పంటలో యూరియాను తగ్గించేయాలని సూచించారు. తక్కువ మోతాదులో వాడితే పంటకు నష్టం తగ్గి.. మంచి దిగుబడి వస్తుందన్నారు. అలాగే పంటలకు తెగుళ్లు వస్తే వాటికి సరిపడా మందులు వేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ దేశెట్టి సిద్ధరాములు, స్థానిక సర్పంచ్ కర్రెయ్య, ఏఈవో గణేష్, చల్మేడ ఎంపీటీసీ సభ్యుడు బాల్ రెడ్డి, సొసైటీ డైరెక్టర్ సుధాకర్ రెడ్డి, విలేజ్ కోఆర్డినేటర్ విజయ్ పాల్గొన్నారు.
- February 25, 2021
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- AGRICULTURE OFFICER
- RAMAYAMPET
- RYTHUVEDIKA
- ఏవో
- పంట సాగు
- రామాయంపేట
- రైతువేదిక
- రైతుశిక్షణ
- Comments Off on పంట సాగులో ఎరువులు తగ్గించండి